కలం, తెలంగాణ బ్యూరో: విద్యార్థులతో ముచ్చట్లు.. రైతుతో సమావేశాలు.. పార్టీ కార్యకర్తలతో సమీక్షలు.. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు.. ఇలా నెలరోజుల్లోనే ఆరు సార్లకుపైగా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిట్టింగ్ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. దీని వెనుక ప్రత్యర్థుల నుంచి వస్తున్న పొలిటికల్ ప్రెజర్ కారణమనే టాక్ వినిపిస్తున్నది. ఇన్నాళ్లూ నల్లేరుపై సాగిన ఆయన గెలుపు ఈసారి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ బీఆర్ఎస్ కేడర్ ను పట్టుకుంది. ఓటమి ఎరుగకుండా గెలుస్తూనే ఉన్న కేటీఆర్‌కు ఈసారి డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు.
ఎన్నడూ సిరిసిల్ల గురించి ఆలోచించని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కరీంనగర్ ఎంపీ పరిధిలోకి వస్తున్న సిరిసిల్లలో ఈసారి బీజేపీ జెండా ఎగరాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నను ఓడించేందుకు చెల్లెలు, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకేసారి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఫోకస్ పెట్టడంతో కేటీఆర్ సైతం ఆ నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు. పరామర్శల పేరుతో సిరిసిల్లను ఎక్కువసార్లు విజిట్ చేస్తున్నారు. నాలుగు పార్టీల పోటాపోటీ వ్యూహంతో ఈసారి సిరిసిల్ల (Sircilla) సీటు ఏ పార్టీకనేది హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నది.
సిరిసిల్ల.. ఇరవై ఏండ్లుగా బీఆర్ఎస్ కు కంచు కోట. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు రాజకీయ జీవితాన్నిచ్చిన నియోజకవర్గం అది. 2009 నుంచి సిరిసిల్ల నుంచే ఆయన వరుసుగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ‘సుక్క పోయలే.. ముక్క ఇవ్వలే.. నోటు పంచలే.. అయినా నన్ను గెలిపించారు’ అంటూ కేటీఆర్ (KTR) ఇటీవల గర్వంగా ప్రకటించుకున్నారు. ఓటమి ఎరుగకుండా గెలుస్తూనే ఉన్న కేటీఆర్‌కు ఈసారి డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు.
ఎన్నడూ సిరిసిల్ల గురించి ఆలోచించని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కరీంనగర్ ఎంపీ పరిధిలోకి వస్తున్న సిరిసిల్లలో ఈసారి బీజేపీ జెండా ఎగరాలని ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇంకోవైపు అన్నను ఓడించేందుకు చెల్లెలు, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకేసారి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఫోకస్ పెట్టడంతో కేటీఆర్ సైతం ఆ నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు. పరామర్శల పేరుతో సిరిసిల్లను ఎక్కువసార్లు విజిట్ చేస్తున్నారు. నాలుగు పార్టీల పోటాపోటీ వ్యూహంతో ఈసారి ఆ సీటు ఏ పార్టీకనేది హాట్ టాపిక్గా మారింది.
ఇప్పుడే మొదలైన హీట్
రాజకీయాల్లో కొన్ని సెగ్మెంట్లు ఎన్నికల సమయంలోనే వార్తల్లో నిలుస్తాయి. మరికొన్ని నిరంతరం చర్చలకు కేంద్రంగా ఉంటాయి. బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష, ప్రతిష్టాత్మక రాజకీయ పోరుకు వేదికగా మారింది. కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అక్కడ రాజకీయ వేడి అసాధారణ స్థాయికి చేరుకున్నదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. అటు సీఎం రేవంత్‌కు, ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు, ఇంకోవైపు కవితకు కేటీఆర్ టార్గెట్‌గా మారారు.
వీటన్నింటితో ఎక్కడో తేడా కొడుతుందనే భావన అక్కడి బీఆర్ఎస్ కేడర్‌లో నెలకొన్నది. దీంతో కేటీఆర్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. “ఈసారి సిరిసిల్లలో కేటీఆర్‌కు డిపాజిట్ కూడా రాదు. ఓడిపోవడం ఖాయం” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ కేవలం రాజకీయ విమర్శగా తీసుకోలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రానివ్వబోమంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహంగానే బీఆర్ఎస్ భావిస్తున్నది.
కేటీఆర్‌కు రాజకీయ జన్మ ఇక్కడే
తెలంగాణ ఉద్యమం టైమ్‌లో కేటీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల (Sircilla). ఆయన ఎదుగుదలకు పునాది వేసింది. కేసీఆర్ తర్వాత ఎఫెక్టివ్ లీడర్‌గా గుర్తింపునిచ్చింది. ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతీ రాజకీయ పరిణామం, అభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణమైంది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో మరే నియోజకవర్గానికి దక్కనంతగా సిరిసిల్లకు ఎక్కువ నిధులు వచ్చాయని, అభివృద్ధికి ప్రాధాన్యం లభించిందంటూ ప్రశంసలు, విమర్శలూ వచ్చాయి.
ఇక్కడ కార్పొరేట్ స్థాయిని తలదన్నేలా ప్రభుత్వ స్కూలు నిర్మాణాన్ని తెలంగాణ విద్యారంగానికే రోల్ మోడల్ అనే స్థాయిలో కేటీఆర్ పబ్లిసిటీ చేసుకున్నారు. అందుకే కేటీఆర్‌కు సిరిసిల్లలో గెలుపు నల్లేరు మీద నడక అని ఆయన అనుచరులు చెప్పుకుంటుంటారు. కానీ, ఈసారి మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సి ఉండటం.. ఇంకోవైపు సిరిసిల్లలో ఓడించాలని మూడు పార్టీలూ టార్గెట్ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంపైనే కేటీఆర్ టైమ్ కేటాయించాల్సి వస్తున్నది.
నెలలోనే అర డజను సార్లు
సిరిసిల్లలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో కేటీఆర్ తన నియోజకవర్గంపై అసాధారణ స్థాయిలో దృష్టి పెట్టారు. నెల రోజుల వ్యవధిలోనే ఆయన అర డజను సార్లు సందర్శించారు. విద్యార్థుల కార్యక్రమాలు, రైతు సమస్యలపై సమావేశాలు, పార్టీ కార్యకర్తలతో సమీక్షలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, స్థానిక నాయకులతో భేటీలు నిర్వహించారు. కేడర్‌ను అప్రమత్తం చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇంత ఫ్రీక్వెంట్‌గా నియోజకవర్గాన్ని విజిట్ చేయడం కేడర్‌నే ఆశ్చర్యానికి గురిచేసింది.
రాజకీయంగా ఒత్తిడి పెరుగుతుండడమే ఇందుకు కారణమనేది వారి భావన. బీఆర్ఎస్ వీక్ అవుతున్నదని, కేడర్‌లో నిరుత్సాహం పెరిగిందన్న కామెంట్లతో కేటీఆర్ అలర్ట్ అయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒకేసారి ఫోకస్ పెట్టడంతో భవిష్యత్తులో పరిస్థితులు క్లిష్టంగా మారుతాయనే భయమే ఇందుకు కారణమన్న మాటలూ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీకంటే చెల్లెలు కవితతోనే ఎక్కువ ప్రమాదం ఉంటుందనే గుసగుసలూ అక్కడ కామన్ అయ్యాయి.
ఓడించడమే ఈ మూడు పార్టీల టార్గెట్
సిరిసిల్లలో కేటీఆర్ ఉదయం టూర్ చేయగానే సాయంత్రానికి ఆయన చెల్లెలు, టీఆర్ఎస్ చీఫ్ కవిత పర్యటించి లోకల్ లీడర్లతో సమావేశమయ్యారు. ఒకే రోజు ఇద్దరూ సిరిసిల్ల (Sircilla)లో పర్యటించడం ఒక అసాధారణ పరిణామంగానే చర్చ జరిగింది. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ విడివిడిగా సిరిసిల్లపై ఫోకస్ పెడుతుంటే కవిత సైతం ఎంట్రీ ఇవ్వడం బీఆర్ఎస్ కేడర్‌ను పార్టీకి దూరం చేస్తారేమో.. భవిష్యత్తులో పొలిటికల్ సీన్‌ను ప్రభావితం చేస్తారేమో.. అనే చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడానికి ప్రతీకారంగా కేటీఆర్‌ను కవిత టార్గెట్ చేస్తున్నట్లు లోకల్ లీడర్లు అంటున్నారు. సిరిసిల్లలో గెలుపు సంగతేమోగానీ కేటీఆర్‌ను ఓడించడం లేదా ఆయన ఆధిపత్యాన్ని వీక్ చేయడం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లక్ష్యంగా మారింది. కేటీఆర్‌కు గతంకంటే మెజారిటీ తగ్గినా అది కూడా పొలిటికల్ ఇష్యూగా మారుతుంది.
ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో పర్యటించారు. స్వచ్ఛ పాఠశాల పేరిట అక్కడి గవర్నమెంట్ స్కూల్కు వెళ్లి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. తన లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో ఇక్కడికి వచ్చానని చెప్పారు. అయితే.. ఇటీవల భగీరథ్ విషయంలో తనను కేటీఆర్ కార్నర్ చేయడంతోనే బండి సంజయ్ అక్కడికి వెళ్లినట్టు చర్చ జరుగుతున్నది. తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ల సంగతి చూస్తానంటూ గతంలో కేటీఆర్ కు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. సిరిసిల్లలో కేటీఆర్‌ను పొలిటికల్‌గా జీరో చేయాలని లక్ష్యంగా బండి సంజయ్ ముందుకు వెళ్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్‌కు డిపాజిట్ కూడా రానివ్వబోనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు గానే కాంగ్రెస్ నేతలు కూడా సిరిసిల్ల నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెగ్మెంట్లో వివిధ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

