పంద్రాగస్టు వేడుకలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

కలం, నారాయణపేట : పంద్రాగస్టు వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గత సంవత్సరం నిర్వహించిన పరేడ్ గ్రౌండ్‌లోనే ఘనంగా నిర్వహించాలని తెలిపారు.

జెండా ఆవిష్కరణ, పరేడ్, వేదిక, వీఐపీ ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ తదితర అంశాల్లో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా అధికారులందరూ రెండు రోజుల్లో తమ శాఖల ముఖ్య విజయాలు, ప్రత్యేక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలను పంపించాలని, వాటి ఆధారంగా కలెక్టర్ ప్రసంగాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. కేవలం పాత నివేదికలను పంపకుండా తాజా సమాచారం, ముఖ్యాంశాలు చేర్చాలని సూచించారు.

విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఈఓ కు సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని, హాజరు నమోదు చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ రావు, డిఆర్డిఓ వెంకట్ రాములు, డీఎస్పీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>