చేతిలో మైక్ ఉంది కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదు’ అని యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) అన్నాడు. ‘తెలుసు కదా(Telusukada)’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా సిద్దూకు చేదు అనుభవం ఎదుయింది. ప్రమోషన్స్ కోసం నిర్వహించిన సమావేశంలో ఓ మహిళా జర్నలిస్ట్.. సిద్దూను అడిని ప్రశ్న ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో నటించారు కదా.. మీరు నిజ జీవితంలో కూడా ఉమెనైజరా?’ అని ఆమె ప్రశ్నించింది. దీంతో షాకయిన సిద్ధూ వెంటనే ‘ఇదేమీ పర్సనల్ ఇంటర్వ్యూ కాదు కదా!’’ అని బదులు ఇచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దూ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘చేతిలో మైక్ ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏం సమాధానం ఇవ్వగలం. అలాంటి ప్రశ్నలు అడగకూడదని వాళ్లే తెలుసుకోవాలి. సినిమాలో హీరో పాత్ర అండర్ కవర్ పోలీసు అవుతాడు. అలాగని నిజంగా కూడా ఎన్‌కౌంటర్ చేస్తాడా?’’ అని అన్నాడు సిద్ధూ(Siddhu Jonnalagadda).

