బనకచర్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తప్పుబట్టారు. రేవంత్ ప్రభుత్వం కావాలనే ఈ అంశంలో ఆలస్యంగా స్పందిస్తుందని, బీఆర్ఎస్ సమయానుసారంగా వ్యవహరిస్తున్నా కాంగ్రెస్ మాత్రం అలా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిరోజు నుంచి కూడా బనకచర్లను నివారించే అంశంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిగా ఓ ఫొటోను షేర్ చేసుకున్నారు. అందులో బనకచర్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల స్పందనలను తేదీ, టైమ్‌తో సహా ఉన్నాయి. అవి షేర్ చేసిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
పాత డేట్ (10-10-2025) తో నేడు లేఖ విడుదల చేయడం తప్ప, ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఆపే ఉద్దేశ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? లేదా? గోదావరి బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్ లో ఉందని, ప్రాసెస్ చేస్తున్నం అని స్పష్టం చేస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23, 2025 తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంతు రెడ్డికి ఉత్తరం రాసిండు. ఇదే విషయాన్ని నేను 11.10.2025 నాడు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి నిలదీశాను. అయినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. అనుమతులు ఇవ్వొద్దు అంటూ కేంద్ర మంత్రికి ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) లేఖ రాయకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే’’ అని వ్యాఖ్యానించారు.
‘‘06.10.2025 నాడు ఏపీ DPR టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి గానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గాని ఇప్పటివరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇదే విషయంలో తెలంగాణ ఇరిగేషన్ సెక్రెటరీ, ఎందుకు కేంద్ర జలశక్తి సెక్రటరీకి ఉత్తరం రాయడం లేదు? పాత డేట్ వేసి, ఈఎన్సీతో CWC కి ఉత్తరం రాస్తే ఏం లాభం? ఒకవైపు ఏపీ అక్రమ ప్రాజెక్టు కట్టేందుకు వేగంగా ముందుకు కదులుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలను బ్యాక్ డేటెడ్ లెటర్లతో మభ్యపెడుతున్నది. గోదావరి నదీ జలాలను వరద జలాల పేరిట తరలించేందుకు తలపెట్టిన ఏపీ అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలు.. డీపీఆర్ కు టెండర్లు ఆహ్వానించే వరకు ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నిద్ర లేపుతూ వచ్చింది’’ అని ఎద్దేవా చేశారు.
‘‘బనకచర్ల ద్వారా తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాసే కుట్రలకు పాల్పడుతున్నదని ఎన్నిసార్లు ముల్లుకర్రతో పొడిచినా, రేవంతు రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. తెలంగాణ భవన్ వేదికగా మొన్న (11.10.2025) ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, మూడు రోజుల తర్వాత నెమ్మదిగా నిద్రలేచి పాత డేట్ తో లేఖ విడుదల చేయడం సిగ్గుచేటు’’ అని ఆగ్రహం Harish Rao వ్యక్తం చేశారు.
Read Also: పోలవరం-బనకచర్లపై కేంద్రానికి లేఖ..

