epaper
Tuesday, November 18, 2025
epaper

Shubman Gill | రోహిత్‌ను రీప్లేస్ చేసిన శుభ్‌మన్ గిల్

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను శుభ్‌మన్‌ గిల్(Shubman Gill) రీప్లేస్ చేశాడు. రోహిత్‌ను పక్కనబెట్టిన మరీ సెలక్టర్లు జట్టు పగ్గాలను గిల్‌ చేతికి అందించారు. వన్డేల్లో టీమ్‌ను ముందుండి నడిపించే బాధ్యతలను అతనికి ఇచ్చారు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ్(Rohit Sharma).. జట్టు సారథ్య బాధ్యతలను నిర్వర్తించారు. కాగా ప్రస్తుతం అతడి కెరీర్ ముగింపు దశకు రావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న మూడు వన్డేలా సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించారు. ఈ సిరీస్ నుంచే భారత్‌కు కొత్త కెప్టెన్‌ను తీసుకురావాలని డిసైడ్ అయిన బీసీసీఐ.. శుభ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ సిరీస్ నుంచే గిల్.. వన్డే కెప్టెన్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేస్తాడు.

కాగా, ఈ క్రమంలోనే జట్టుకు కొంతకాలంగా దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యార్‌కు ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. అతడిని టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా భారత్.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఈ టీ20 సిరీస్.. అక్టోబర్ 29 నుంచి మొదలవుతుంది. ఈ రెండు సిరీస్‌లకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. ఆసిస్‌ను వన్డేల్లో ఎదుర్కొనే టీమిండియా జట్టులో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేశారు.

వన్డే జట్టు: Shubman Gill (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

టీ20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్), నితీశ్ కుమార్‌ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్, కుల్‌దీప్, హర్షిత్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.

Read Also: ‘వార్-2’ రిజల్ట్‌పై హృతిక్ కామెంట్.. చేయాల్సింది చేశానంటూ..
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>