epaper
Tuesday, November 18, 2025
epaper

Dhanush | స్పీడ్ పెంచిన ధనుష్.. ఒకే ఏడాది 4 సినిమాలు

తమిళ హీరో ధనుష్(Dhanush) స్పీడ్ పెంచాడు. ఒక ఏడాది నాలుగు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు. హిట్ ప్లాప్‌తో సంబంధం లేకుండా ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో వరుస సినిమాుల చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే ధనుష్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి. కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాలతో మంచి ఫలితాలను ధనుష్ సొంతం చేసుకున్నాడు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బాగా పర్ఫార్మ్ చేశాయి. అయితే ఇదే ఏడాది మరో రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి ధనుష్ రెడీ అవుతున్నాడు.

వాటిలో బాలీవుడ్‌లో చేస్తున్న ‘తేరే ఇష్క్ మే’ కూడా ఒకటి. ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ధనుష్ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్.. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ‘అతరంగి రే’ సినిమాతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్న ధనుష్.. ఈ సినిమాతో తన మార్కెట్ విలువను సెట్ చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రిలీజ్ కావడానికి ధనుష్ 54 కూడా రెడీ అవుతోంది. విగ్నేష్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ ప్రకటించాలని మేకర్స్ అనుకుంటున్నారు. అయితే ధనుష్ చేస్తున్న ఒక్కో సినిమా ఒక్కో జానర్‌లో ఉండటం విశేషం. అన్ని జానర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ధనుష్ రెడీ అవుతున్నాడు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్‌లకు కూడా ధనుష్ ఓకే చేశాడని సమాచారం. వరుస సినిమాలతో అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వడానికి ధనుష్(Dhanush) రెడీ అవుతున్నాడు. మరి వాటిల్లో ఎన్ని ఫుల్ మీల్స్ అవుతాయో ఎన్ని తుస్సు మంటాయో చూడాలి.

Read Also: పవన్‌తో దిల్ రాజు ప్రాజెక్ట్ లాక్..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>