టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్(Shreyas Iyer).. ఆస్ట్రేలియాలోని ఓ ఆసుప్రతిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో సిడ్నీ(Sydney)లోనే ఆసుపత్రికి తరలించారు అధికారులు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు పక్కటెముకలకు దెబ్బతాకింది. దీంతో శ్రేయాష్ అక్కడే పడిపోయాడు. తొలుత స్వల్ప గాయం అనుకున్నా.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమించింది. దీంతో టీమిండియా మెడికల్ టీమ్ అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించింది.
అతడికి స్కానింగ్ నిర్వహించిన వైద్యులు.. పక్కటెముకల్లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. వెంటనే శ్రేయాస్‌ను ఐసీయూకు తరలించారు. అతడిని రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపారు. బ్లీడింగ్ ఆగే వేగం, ఇన్ఫెక్షన్‌ల ఆధారంగా మరో ఏడు రోజుల వరకు శ్రేయాస్(Shreyas Iyer)ను ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ(BCCI) కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా.. శ్రేయాస్ పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చారు.
‘‘శ్రేయాస్‌కు స్ప్లీన్‌లో లాసరేషన్ గాయం ఉంది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. వేగంగా కోలుకుంటున్నాడు. సిడ్నీ, భారత్‌లోని వైద్యులతో సమన్వయం చేసుకుంటూ శ్రేయాస్ ఆరోగ్యాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది’’ అని తెలిపారు. ఈ గాయం కారణంగా త్వరలో ఇండియాలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయాస్ ఆడటం డౌట్‌గా మారింది.
Read Also: హర్షిత్ రాణాకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్..

