మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అవినీతిపై చర్చకు తాము సిద్ధమని, దమ్ముంటే ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రావాలని గతంలో ఛాలెంజ్ చేశారు. అన్న విధంగానే సోమవారం బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్‌తో పాటు పలువురు నాయకులు అంబేద్కర్ బొమ్మ దగ్గరకు చేరుకున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) చర్చకు రావాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు సైఫాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. కొప్పుల ఈశ్వర్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు స్టేషన్‌కు తరలించారు.
Read Also: క్యాబినెట్ రీషఫ్‌ల్.. తనకేం తెలీదన్న మంత్రి

