టీమిండియాలో చోటు దక్కించుకున్నప్పటి నుంచి హర్షిత్ రాణా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. గంభీర్(Gautam Gambhir) మనిషి కాబట్టే హర్షిత్‌కు జట్టులో స్థానం దక్కిందని కూడా విమర్శించారు. దానికి తగ్గట్లే తొలి రెండు వన్డేల్లో హర్షిత్ అత్యంత పేలవమైన ప్రదర్శన చేశాడు. దాంతో అప్పట్లో వచ్చిన విమర్శలు నిజమే అన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హర్షిత్ రాణా(Harshit Rana)కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జట్టులో కొనసాగాలంటే ఆటపై ఫోకస్ పెట్టాలని తేల్చి చెప్పాడట గంభీర్. ఈ విషయాన్ని హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో కూడా హర్షిత్ రాణా ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో సిడ్నీ వన్డేకు ముందు హర్షిత్‌కు గంభీర్(Gautam Gambhir) ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడట. ఆ విషయాన్ని హర్షిత్ తనకు ఫోన్‌లో చెప్పాడని శ్రవణ్ తెలిపారు. ‘‘సిడ్నీ వన్డేకు ముందు హర్షిత్ నాకు ఫోన్ చేశాడు. తన ప్రదర్శనపై వస్తున్న విమర్శలను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఆ సందర్భంగానే జట్టులో ఉండాలంటే పర్ఫార్మెన్స్ బాగుండాలని, లేని పక్షంలో జట్టులో స్థానం కష్టమని గంభీర్ చెప్పాడని చెప్పాడు. దాంతో నున్ను నువ్వు నమ్ముకో అని నేను చెప్పాను’’ అని శ్రవణ్ వివరించారు.
Read Also: రికార్డ్‌లు బద్దలు కొట్టిన కోహ్లీ..

