కలం,సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ క్రేజీ ప్రాజెక్టుని గ్రాండ్‌గా నిర్మిస్తుంది. ఇటీవల ఇంట్రెస్టింగ్ వీడియో గ్లింప్స్ తో మేకర్స్ ఈ మూవీని ప్రకటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఈ వేసవి నాటికి పూర్తి కానున్నట్లు సమాచారం. ఆ తరువాత లోకేశ్ కనగరాజ్ మూవీ షూటింగ్ లో అల్లుఅర్జున్ బిజీ కానున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ మూవీకి సంబంధించి హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ద కపూర్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించనుంది దీనికి సంబంధించి మేకర్స్ త్వరలో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. శ్రద్ద కపూర్ గతంలో ప్రభాస్ సరసన ‘సాహో’ సినిమాలో నటించింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో తెలుగులో ఈ భామ రెండో సినిమా చేస్తుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.


