కలం, జనగామ : వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జనగామ (Jangaon) పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. డీసీపీ రాజమహేందర్ నాయక్ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు బృందం పట్టణంలోని ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు స్పీడ్ కంట్రోల్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

