Mobile Popup Ad
Mobile Popup Ad

అన్నదాతలకు గుడ్​ న్యూస్​.. ‘రైతు భరోసా‘ ముహూర్తం ఫిక్స్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ఈ నెల 22న రైతు భ‌రోసా (Rythu Bharosa) మొద‌టి విడ‌త నిధులు విడుద‌ల‌కు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట నుంచి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేరకు రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌పై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, అధికారుల‌తో సీఎం చర్చలు జరిపారు.

తొలి విడ‌త‌గా మొత్తం 70 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎక‌రం వ‌ర‌కు రైతు భ‌రోసా (Rythu Bharosa) కింద రూ.3,590 కోట్లు బ‌దిలీ చేసేందుకు సీఎం రేవంత్​ ఒకే చెప్పారు. రెండో విడుతలో భాగంగా మరో మ‌రో 20 రోజుల త‌ర్వాత రూ.2,650 కోట్లు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏప్రిల్ నెలాఖ‌రులోపు మూడో విడ‌త‌గా మొత్తం రైతు భ‌రోసా నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. మూడు విడ‌త‌ల్లో సుమారు రూ.9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు రైతుల ఖాతాల్లో చేరనున్నాయి. ప్రభుత్వం ప్రకటనతో రైతుల ఆనందంలో మునిగిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>