మతాల మధ్య చిచ్చు.. తెలంగాణలో చెల్లదు: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: మతాల మధ్య చిచ్చు పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో చెల్లదని కాదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొంతమంది మతాల మధ్య కొట్లాటలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలను చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ కేవలం పండుగ కాదని.. ఆత్మశుద్ధి చేసుకునే సమయమని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజలంతా సోదరభావంతో మతసామరస్యంతో కలిసి మెలిసి ఉండాలని చెప్పారు.

ముస్లింలకు అధిక ప్రాధాన్యం

తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. అజహారుద్దీన్‌కు క్యాబినెట్‌లో చోటు కల్పించామని గుర్తు చేశారు. సీనియర్ నేత షబీర్ అలీకి సలహాదారు పదవి ఇచ్చామన్నారు. మొత్తం 8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. ’క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉదోగ్యం ఇచ్చాం. బాక్సర్ నిక్కత్ జరీన్‌కు రూ. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాము. ప్రభుత్వ ప్రతి కార్యక్రమంలో మైనార్టీ కు సింహ భాగం ఇస్తున్నాం. అంతా కలిసి మెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. వైఎస్ హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్ల వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రభుత్వం మీది నేను మీ సోదరుడిని‘ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలి. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం కలిసి మెలసి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలి. దేశంలో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం‘ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>