కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి (Jogipet hospital)కి ఆలస్యంగా వస్తున్న కారణంగా 12 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిన్న జోగిపేట హాస్పిటల్ లో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కమిషనర్ తనిఖీలు చేస్తున్న సమయంలో మొత్తం 23 మంది డాక్టర్లుండగా కేవలం నలుగురు డాక్టర్లు మాత్రమే విధులకు హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో డాక్టర్ వెంకటేశ్వరరావు, కే.హరీశ్, దివ్య జ్యోతి, మేఘన, ఆనంద్‌నాయక్, ఎన్.సంఘమణి, బి. శ్రీనివాస్‌రెడ్డి, శారదాదేవి, శివప్రసాద్, సుధారాణి, సల్మా, పూజా లకు నోటీసులు జారీ అయ్యాయి.


