కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడు పాయల వనదుర్గ అమ్మవారి ఆలయానికి (Edupayala Temple) ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం ఎఫెక్ట్ తగిలింది. ఆలయంలోని ప్రసాద తయారీ కేంద్రానికి గ్యాస్ సిలిండర్ల కొరత (Gas Shortage) సెగ తలిగింది. ఆలయ నిర్వాహకులు గ్యాస్ కొరత కారణంగా ప్రత్యామ్నాయంగా రాత్రికి రాత్రే కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేశారు. ఆలయానికి సంబంధించిన ప్రసాదాలను కట్టెల పొయ్యిపై తయారు చేస్తున్నారు. భక్తుల కోసం అమ్మవారి లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాల తయారీకి ఆటంకం కలగకుండా మట్టితో కూడిన కట్టెల మండీలను కొత్తగా తయారు చేశారు. ఏడు పాయల వనదుర్గ ఆలయం(Edupayala Vana Durga Temple)లో గ్యాస్ కొరత ఉందని, దానికి ప్రత్యామ్నాయంగా ప్రసాదాల తయారీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పొయ్యిలను వినియోగిస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. గ్యాస్ కొరత ప్రభావం దేవాలయాలపై పడిందని, గ్యాస్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని దేవాలయానికి గ్యాస్ కేటాయింపులు చేయాలని కోరుతున్నారు.
Read Also: మూసీ ప్రాజెక్ట్ DPR ఎక్కడ?: రేవంత్ కు హరీశ్ 8 ప్రశ్నలు
Follow Us On: Instagram

