కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్లేయింగ్ 11పై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో RCB ప్లేయింగ్ ఎలెవన్‌లో వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) కు స్థానం ఉండకపోవచ్చని మాజీ భారత క్రికెటర్ సంజయ్ బంగర్ (Sanjay Bangar) అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బంగర్.. ఆటగాడిని ఎక్కువ ధరకు కొనుగోలు చేసినంత మాత్రాన జట్టులో స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించాడు.
గత సీజన్ చివరి దశలో దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) వేగంగా పరుగులు సాధించాడని బంగర్ గుర్తుచేశారు. అందువల్ల అతడిని జట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి RCB తొలి టైటిల్ గెలుచుకుంది. అందువల్ల ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటే గత సీజన్ జట్టునే మొదటి మ్యాచ్‌లో కొనసాగించే అవకాశం ఉందని బంగర్ (Sanjay Bangar) అభిప్రాయపడ్డారు.
బంగర్ ప్రెడిక్షన్ జట్టు
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, సుయాష్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్స్ గా సూచించారు.
Read Also: భారత్ నుంచి బయలుదేరిన వెస్టిండీస్ టీమ్!
Follow Us On: Instagram

