కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పీఏపై అట్రాసిటీ కేసు!

క‌లం, వెబ్ డెస్క్‌: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ (Bhupalpally MLA Gandra Satyanarayana) పీఏ శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శ్రీనివాస్ త‌న‌ను మోసం చేశాడ‌ని పేర్కొంటూ ఓ యువ‌తి చిట్యాల పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేర‌కు పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ద‌ళిత‌ యువ‌తితో శ్రీనివాస్ కొన్నేళ్లుగా ప్రేమాయ‌ణం సాగించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మ‌బ‌లికి శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా మరో యువతితో పెళ్లి నిశ్చయించుకున్నాడు. దీనిపై బాధితురాలు శ్రీనివాస్‌ను నిల‌దీసింది. ముందు పెళ్లి చేసుకుంటాన‌న్న శ్రీనివాస్ మాట మార్చి, కులం పేరుతో దూషించి బెదిరిస్తున్నాడ‌ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీనివాస్‌తో పాటు అతని త‌ల్లిదండ్రుల‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: రాష్ట్రంలో అభివృద్ధి జాతర జరుగుతుంది :మంత్రి పొంగులేటి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>