భూపాలపల్లిలో దారుణం.. సొంత నానమ్మను చంపిన మనుమడు

కలం, వరంగల్ బ్యూరో : భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. డబ్బుల కోసం సొంత నానమ్మను మనుమడే హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం, భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లికి చెందిన ఐలమ్మ(60)ను ఆమె మనుమడు జాకేందర్ రూ.30 వేల కోసం మూడు రోజుల కిందట హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గణపురం పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితుడు జాకేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also: తమిళనాడు సీఎం విజయ్ వివాదాస్పద నిర్ణయం !

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>