నెదర్లాండ్ టార్గెట్ 194.. ఇండియా 193/6

కలం, స్పోర్ట్స్ : నెదర్లాండ్‌తో జరుగుతున్న పోరులో శివమ్ దూమే (Shivam Dube) శివమెత్తించాడు. ఓపెనర్లు అంతంత మాత్రంగా ఆడినా దూబే మాత్రం దుమ్ముదులిపేశాడు. 31 బంతుల్లో 66 పరుగులు చేసి బీక్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడాడు. అంతా సిక్స్ అనుకుంటే సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌కు వచ్చిన గగ్‌స్టన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో రింకూ సింగ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 7 బంతుల్లో 18 పరుగులు చేసి పవర్ బూస్ట్ ఇచ్చాడు. తిలక్ వర్మ 27 బంతుల్లో 31 పరుగులతో నిలకడగా రాణించాడు. క్రీజ్‌లో పాండ్యా 21 బంతుల్లో 30 పరుగులు చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. రింకూ సింగ్ 3 బంతులు ఆడి 6 పరుగులు చేశాడు. దీంత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

నెదర్లాండ్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చాడు. కానీ అదే విధంగా 3వికెట్లు పడగొట్టాడు. ఆర్యన్ దత్ 4 ఓవర్లు వేసి 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కైల్ క్లేన్ 4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.

194 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్ బ్యాటింగ్ లైనప్ ఏమాత్రం సక్సెస్ అవుతుందనేది చూడాలి. అంతేకాకుండా మరోసారి భారత బౌలర్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారా? అనేది కూడా కీలకంగా మారింది. పాక్‌పై చెలరేగిన బౌలర్లు నెదర్లాండ్స్‌ను కూడా ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలోనే బుమ్రా, పాండ్యా బౌలింగ్ ఇరగదీస్తారని అంచనా వేస్తున్నారు. మరి నెదర్లాండ్స్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు ఎంత మేర సక్సెస్ అవుతారో చూడాలి.

ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్‌లో 8 పాయింట్లతో భారత్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. రెండో స్థానంలో ఆరు పాయింట్లతో పాకిస్థాన్ ఉంది. నాలుగు పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉన్న యూఎస్‌ఏ ఇంటి బాట పట్టింది.

Read Also: వివాదాల ‘ఇంపాక్ట్’.. ఏఐ సమ్మిట్​లో రోబో డాగ్​ రభస

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>