కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ (Journalist Accreditation) కార్డులు అందిస్తామని తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్(ఐఅండ్‌పీఆర్) స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక (CH Priyanka) తెలిపారు. జీవో నెం.252 ప్రకారం జర్నలిస్ట్‌లకు అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందన్నారు.
అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్ట్‌లు ipr.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో ఏవైనా టెక్నికల్ సమస్యలు వస్తే మీడియా రెగ్యులేషన్ విభాగాన్ని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. దీనికోసం ఆఫీస్ పనివేళల్లో 9154170881 నెంబర్‌కు కాల్ చేసి, సమస్యను వివరించవచ్చని పేర్కొన్నారు. (Journalist Accreditation) ఈ మేరకు ఐపీఆర్డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ ఖాతాలో ఓ ట్వీట్‌ను ఆమె పోస్ట్ చేశారు.
Read Also: నెదర్లాండ్ టార్గెట్ 194.. ఇండియా 193/6
Follow Us On : WhatsApp


