epaper
Wednesday, February 18, 2026
epaper

ఎమ్మెల్యే మైనంపల్లిపై దాడి కేసులో నిందితుల రిమాండ్

క‌లం, మెద‌క్ బ్యూరో: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వాహనంపై రాళ్ల దాడి చేసిన ఘటనలో నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు మెదక్ (Medak) డీఎస్పీ డి. ప్రసన్నకుమార్ తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ మీడియాకు తెలిపారు. మున్సిపల్ ఎన్నిక‌ల పోలింగ్ ముందురోజు మెద‌క్‌లో కాంగ్రెస్, బీఅర్ఎస్ నాయ‌కుల మధ్య వివాదం జరిగింది. దాదాపు 23 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మైనంపల్లి (Mynampally Rohit) వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వాహనం ధ్వంసం కాగా, ఎమ్మెల్యే, ఆయన అనుచరులకు గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన గోదాల అఖిల అనే మహిళను బీఆర్ఎస్ కార్యకర్త మల్లికార్జున్ గౌడ్ గాయపర్చాడు.

ఈ ఘటనలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మరికొందరిని రిమాండ్ చేస్తామన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Read Also: భారత్ జోరుపై సంజయ్ బంగర్​ కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>