Mobile Popup Ad
Mobile Popup Ad

కేతేపల్లిలో గొర్రెల కాపరి దారుణ హత్య

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలోని కేతేపల్లి (Kethepalli) మండలం భీమారం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గొర్రెల మందకు కాపలాగా నిద్రిస్తున్న గొర్రెల కాపరి జానయ్యను గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో కిరాతకంగా హత్య చేశారు. మృతుడు భీమారం గ్రామానికి చెందిన జానయ్యగా పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా గొర్రెల కాపరిగా పనిచేస్తున్న ఆయన శనివారం రాత్రి తన గొర్రెల మందను గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఉంచి అక్కడే కాపలాగా నిద్రపోయారు.

అర్ధరాత్రి సమయంలో వచ్చిన దుండగులు పదునైన ఆయుధాలతో జానయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కేతేపల్లి (Kethepalli) పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య వెనుక పాత కక్షలు ఉన్నాయా? లేదా గొర్రెల దొంగతనానికి వచ్చిన దుండగుల పనినా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో భీమారం గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. నిందితులను త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Read Also: అభిషేక్ శర్మ విధ్వంసం.. సిక్సర్ల వర్షం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>