Mobile Popup Ad
Mobile Popup Ad

అభిషేక్ శర్మ విధ్వంసం.. సిక్సర్ల వర్షం

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ లో నేడు శనివారం డబుల్ హెడర్ లో భాగంగా తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్(PBKS), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు మధ్య మ్యాచ్ జరుగుతోంది. చండీగఢ్ లోని ముల్లన్ పూర్ మహారాజా యదవీంద్రసింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ (Abhishek Sharma) తనదైన బ్యాటింగ్ తో సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

అభిషేక్ శర్మ బౌండరీల మోత మోగిస్తూ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత గేర్ మార్చి దూకుడు పెంచాడు. హెడ్ కూడా తనదైన బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు. వీరిద్దరి జోరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 105 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma) 22 బంతుల్లో 66 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అభిషేక్ ఖాతాలో 7 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఏకంగా 300 స్ట్రైక్ రేటుతో అభిషేక్ శర్మ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అటు ట్రావిస్ హెడ్ 206 స్ట్రైక్ రేటుతో 5 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 15 బంతుల్లో 31 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీరిద్దరి జోరు చూస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా 300 పరుగుల స్కోరు నమోదు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మరి ఈ బ్యాటర్లు ఇదే జోరును కనబరుస్తారా? లేదా పంజాబ్ బౌలర్లు బ్యాటర్ల దూకుడుకు కళ్లం వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Read Also: మహారాష్ట్రలో భూకంపం.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>