యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ప్రస్తుతం తన 36వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం తన లుక్స్ మొత్తాన్ని ఛేంజ్ చేసుకుంటున్నాడు. స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘బైకర్(Biker)’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్ మూవీపై అంచనాలను భారీగా అధికం చేసింది. ఈ మూవీ కోసం శర్వ ఎంత కష్టపడుతున్నాడంటే ఫుల్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాడు. తన తాజా ఫొటో షూట్ ఫొటోలను శర్వా షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోలను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇందులో ఒక పక్కా బౌకర్ లుక్స్‌తో శర్వా ఔరా అనిపిస్తున్నాడు.
నెలల తరబడి వర్కౌట్స్, పక్కా డౌట్‌తో శర్వా తన ఫిజిక్‌ను ఛేంజ్ చేసుకున్నాడు. అథ్లెటిక్ బాడీని సొంతం చేసుకున్నాడు. ‘బైకర్’ సినిమాలో శర్వా పాత్రపై ఈ లుక్స్ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో శర్వా(Sharwanand) సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.
Read Also: ప్రదీప్ రంగనాథన్ హీరో మెటీరియల్ కాదా..!

