కర్నూలు బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటన నుంచి కోలుకోకముందే హైదరాబాద్(Hyderabad)లో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్‌పేట(Pedda Amberpet) దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఈవీ బస్సు బోల్తా పడింది. బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణికులు.. పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూగో ఎలక్ట్రికల్ బస్సుకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

