epaper
Monday, November 17, 2025
epaper

కేకేఆర్ ఫ్యామిలీలోకి షేన్ వాట్సన్..

కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్యామిలీలోకి షేన్ వాట్సన్(Shane Watson) కూడా చేరాడు. ఐపీఎల్ 2026కు ముందు ఈ మార్పు జరిగింది. టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు వాట్సన్. ఇది వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు తిరిగి మూడేళ్ళ తర్వాత కేకేఆర్‌కు వచ్చాడు. ఇటీవల కేకేఆర్ హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్ పండిత్‌ను అభిషేక్ నాయర్ వచ్చాడు. ఇప్పుడు వాట్సన్ కూడా చేరాడని టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. జట్టును రింత బలోపేతం చేయడానికి అభిషేక్, వాట్సన్ కలిసి పనిచేస్తారని వెల్లించింది.

‘‘కేకేఆర్(KKR) లాంటి ఐకానిక్ టీమ్‌లో భాగం కావడం హ్యాపీా ఉంది. మరో ఐపీఎల్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కోచింగ్ గ్రూప్, ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని వాట్సన్ పేర్కొన్నారు. 2007, 2015లో వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన ఆసీస్‌ జట్టులో షేన్‌వాట్సన్‌(Shane Watson) సభ్యుడిగా ఉన్నాడు. అతడు 59 టెస్ట్‌లు, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. అదే విధంగా ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నాలుగు సెంచరీలు కొట్టాడు.

Read Also: దక్షిణాఫ్రికాకు దడపుట్టించిన భారత బౌలర్లు..!

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>