epaper
Monday, November 17, 2025
epaper

కొండా సురేఖకి రిలీఫ్… క్షమించేసిన అక్కినేని

మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై వేసిన పరువు నష్టం కేసును హీరో నాగార్జున(Nagarjuna) విత్‌డ్రా చేసుకున్నాడు. తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు కోరడంతో కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు. అయితే నాగార్జున కుటుంబం చేసిన వ్యాఖ్యలకు తాను ఎంతో పశ్చాత్తాపం పడుతున్నానని కొండా సురేఖ.. అర్థరాత్రి సమయంలో పోస్ట్ పెట్టారు. ‘‘ఆయన కుటుంబం నేను చేసిన వ్యాఖ్యలు ఆయనను కించపరచాలని, బాధపెట్టాలని కాదు. ఆయనది కానీ, ఆయన కుటుంబానికి కానీ పరువుకు భంగం కలిగించాలన్న ఆలోచన కూడా నాకులేదు. నా వల్ల జరిగిన తప్పుకు నేను చింతిస్తున్నాను. ఆ రోజు చేసిన వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నా’’ అని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెపై నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు.

అక్టోబర్ 2, 2024న తన కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలకు నాగార్జున(Nagarjuna).. నాంపల్లికోర్టును ఆశ్రయించారు. ఆ కేసునే నాంపల్లి కోర్టు(Nampalli Court) విచారిస్తోంది. రెండువైపుల వాదనలను విన్న కోర్టు బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద సురేఖ మీద కేసు నమోదుచేయలని పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతూనే ఉంది. కాగా ఇటీవల కొండా సురేఖ క్షమాపణలు కోరారు.

Read Also: గ్లోబ్‌ట్రోటర్‌.. అభిమానులకు జక్కన్న జాగ్రత్తలు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>