How to Impress Girls | ఈ జనరేషన్ యువకుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే.. అసలు ఒక అమ్మాయికి నచ్చాలంటే మనం ఏం చేయాలి? అని. ఇందులో భాగంగానే తమకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు. ఇందులో ఒక్కో అబ్బాయిది ఒక్కో పంథా ఉంటుంది. కొందరు గిఫ్ట్‌లు ఇచ్చి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే.. మరికొందరు మాటలతో మెప్పిందాం అనుకుంటారు. కానీ ఇందులో ప్రతిఒక్కరూ సక్సెస్ కారు. ఈ ప్రశ్నకు మానసిక తత్వవేత్తల దగ్గర కూడా సరైన సమాధానం లేదు. ఇంప్రెస్ అవ్వడం కాకపోవడం అనేది అమ్మాయి అమ్మాయికి మారిపోతుందని వారు చెప్తున్నారు. నిజం చెప్తే మానసిక తత్వవేత్తలు కూడా ఇది జవాబు లేని ప్రశ్న అంటున్నారు. అదే సమయంలో జవాబు లేదని చెప్పలేం కానీ.. అనేక జవాబులు ఉన్నాయని చెప్పుకోవచ్చని కూడా అంటున్నారు. ఆడవారిని అర్థం చేసుకోవడం కష్టమంటూనే.. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి కొన్ని ఓవరాల్ సూచనలు చేస్తున్నారు. ఇవి అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడేలా చేయదు కానీ.. మీపై మంచి ఒపెనీయన్ ఉండేలా చేస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆ సూచనలు ఏంటో చూద్దామా..
How to Impress Girls :
గౌరవం చూపు
అవును.. అమ్మాయికనే కాదు. ఎవరికైనా మనం గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇస్తున్న వారితే ప్రతి ఒక్కరూ ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. అమ్మాయిల విషయంలో ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఆమె అభిప్రాయాలను, నిర్ణయాలను, వ్యక్తిగత స్పేస్‌ను, ఆలోచనలను గౌరవించు. అలాగని తాను ఏదంటై అదే రైట్ అనడం కాదు.. వాటికి విలువ ఇవ్వాలి. “నచ్చాలి” అని ప్రయత్నించే కంటే “గౌరవించాలి” అని ఆలోచిస్తే ఆమెకు నిన్ను నమ్మకం కలుగుతుంది.
స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడి
అవసరం కోసం అబద్ధాలు చెప్పడం, నటించడాన్ని ఎవరూ ఇష్టపడరు. అమ్మాయిలయినా సరే. అందుకే వాళ్ల దగ్గర నువ్వు ఎవరో, నిజంగా ఎలాంటి వ్యక్తివో అలానే ఉండాలి. సరళమైన, వినయపూర్వకమైన మాటలతో మాట్లాడి “ఫేక్ స్టైల్” చూపించాల్సిన.. ఇంకా కరెక్ట్‌గా చెప్పాల్సిన ఫేక్ నిన్ను చూపించాల్సిన అవసరం లేదు.
అర్థం చేసుకో
నీ ఇష్టాలను ఆమెకు చెప్పడమే కాదు.. ఆమెను కూడా అర్థం చేస్కో. ఆమెకు ఏమి ఇష్టం, ఏవి ఇష్టంలేవు, ఆమెకు ఏ విషయాలు ముఖ్యం అనేది గుర్తించు. వినడం నేర్చుకో. ఎక్కువగా మాట్లాడటం కంటే వినడం ఎక్కువ ప్రభావం చూపుతుంది. తను చెప్పే విషయాలను విను.. అది ఆమెను నీవైపు ఎట్రాక్ట్ చేస్తుంది
స్మార్ట్‌గా ఉండు
దుస్తులు ఖరీదైనవి కావాల్సిన అవసరం లేదు. కానీ ధరించేవి శుభ్రంగా, నున్ను స్మార్ట్‌గా చూపేలా ఉండాలి. స్వచ్ఛంగా, సరిగా, నమ్మకంగా ఉండాలి. మంచి వాసన, మంచి హెయిర్ స్టైల్, క్లీన్ షూస్ ధరించాలి. ఇవి చిన్న విషయాలే కానీ వీటి ప్రభావం చాలా పెద్ద ముద్ర వేస్తాయి.
ఆత్మవిశ్వాసం చూపు
ఏం చేస్తున్నా కాన్ఫిడెంట్‌గా ఉండు. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్‌గా, అహంకారంగా మారకుండా చూసుకో. నీ నిర్ణయాలు, నీ లక్ష్యంపై నమ్మకంగా ఉండు. అది అమ్మాయికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
నీ లక్ష్యంపై క్లారిటీతో ఉండి
నీకు ఏమి కావాలో, ఏం చేస్తున్నావో, ఏం సాధించాలనుకుంటున్నావో తెలిసి ఉండు. ఎవరికైనా నచ్చాలంటే ముందు నీకు నువ్వు నచ్చాలి. నీపై నీకు నమ్మకం ఉండాలి, ఆత్మగౌరం కూడా చాలా ముఖ్యం.
చిన్న చిన్న కేర్ చూపు
“నువ్వు బాగున్నావా?”, “నీ రోజు ఎలా గడిచింది?” అని చాలా జెన్యూన్‌గా అడుగు. చిన్న సర్‌ప్రైజ్ మెసేజ్‌లు, జెన్యూన్ పొగడ్తలు ఉండాలి. ఇవి మనసుకు హత్తుకుంటాయి. అవి న్యాచురల్‌గా ఉండాలి కానీ.. కావాలని చేస్తున్నవిగా, ఆర్టిఫీషియల్‌గా ఉండకూడదు.
సమాధానాన్ని అంగీకరించు..
నువ్వంటే తను నచ్చడం లేదు అని తెలిస్తే.. దాన్ని అంగీకరించు. అంతేకానీ నిన్ను ఇష్టపడాలని ఒత్తిడి చేయకూడదు. తనపై మానసిక ఒత్తిడి కూడా వద్దు. ఆమె నిర్ణయాన్ని గౌరవించు. “No” అంటే No అని అర్థం చేసుకోవడం మగాడి నిజమైన గౌరవం.
సమయం ఇవ్వు
ఇష్టం అనేది ఒక్కరోజులో ఏర్పడదు. సహనం, స్థిరత్వం, గౌరవం ఇవే నిజమైన ఇష్టానికి, ప్రేమకు పునాది. వాటిని కోల్పోవద్దు.
నువ్వుగా ఉండు
అమ్మాయిని ఇంప్రెస్ చేసే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోకు. అమ్మాయి కోసం నటించడం, లేని యాటి్యూడ్ చూపడం అనేవి కొంతకాలమే పనిచేస్తుంది. కానీ నిజమైన వ్యక్తిత్వం మాత్రమే ఎవరినైనా ఆకట్టుకుంటుంది. అది శాశ్వతం అని నిపుణులు అంటున్నారు.
Read Also: ‘నన్ను దేశంలో సగం మంది చంపేయాలనుకున్నారు..’
Follow Us on: Instagram

