IND vs SA | దక్షిణాఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. భారత్-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న తొలి అనఫీషియల్ వన్డేలో.. ఇండియా బౌలర్లు జూలు విధించారు. రాజ్‌కోట్‌లో ఊచకోత కోశారు. 53 పరుగులకే వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికాను తొలి బంతి నుంచే బెంబేలెత్తించారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి బంతికే రుబిన్ హెర్మన్ డకౌట్ అయి.. పెవిలియన్ చేరుకున్నాడు. నాలుగో బంతికి జోర్డన్ హెర్మన్.. తిలక్ వర్మ చేతిలో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్‌కృష్ణ బౌలింగ్‌లో జానీ అకెర్‌మాన్ డకౌట్ అయ్యాడు. దీంతో కేవలం ఒక్క పరుగు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
IND vs SA | ఆ తర్వాత వికెట్లు కుప్పకూలడానికి కాస్తంత గ్యాప్ వచ్చింది. కానీ అర్ష్‌దీప్ మరోసారి చెలరేగాడు. మూన్‌సామీని పది పరుగులకు పెవిలియన్‌కు పంపాడు. దాంతో 16 పరుగులకు దక్షిణాఫ్రికా 16 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం నిశాంత్ సింధు బౌలింగ్‌లో (11.2) సినెథెంబా క్వెషిలే (15) పెవిలియన్‌కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా ఏ జట్టు 53 పరుగులకు అయిదువికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చినా డయాన్ ఫారెస్టర్ (51*), డెలానో పాట్జీటర్ (33*) పోరాడుతున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు తలో వికెట్ తీసుకున్నారు.
Read Also: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్
Follow Us on: Instagram

