epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కాళోజీ వర్సిటీ ప్రొఫెసర్‌పై లైంగిక ఆరోపణలు

కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ(Kaloji Health University)లో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ విద్యార్థిని విషయంలో సదరు ప్రొఫెసర్ అమానుషంగా వ్యవహరించారట. లైంగికంగా వేధించడంతోపాటు ఫిర్యాదు చేసిందనే కోపంతో విద్యార్థినిని కావాలనే ఫెయిల్‌ చేయించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ప్రస్తుతం వైద్యవర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపుతోంది.

ఫిర్యాదుతో మొదలైన వివాదం

యూనివర్సిటీ(Kaloji Health University)లో పీజీ చదువుతున్న ఒక విద్యార్థిని, తమ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. రాత్రివేళ అసభ్యకరమైన మెసేజీలు పంపుతూ, పలుమార్లు అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు విద్యార్థిని ఆరోపణలు చేసింది. అంతేకాక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని పగ పెంచుకొని సదరు విద్యార్థిని కావాలనే ఫెయిల్ చేయించాడు. ఫిర్యాదులో ఉన్న సీరియస్ ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న యాజమాన్యం, ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించింది. ఈ నిర్ణయం తర్వాత అతని ప్రవర్తనపై పూర్తి స్థాయి విచారణకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

విచారణ కమిటీ గుర్తించిన సంచలన అంశాలు

వైద్య విద్యాశాఖ అధికారులతో కూడిన ఈ కమిటీ విద్యార్థిని, ఇతర సాక్షులు, విభాగ సిబ్బందిని విచారించింది. సేకరించిన ఆధారాలతో సిద్ధం చేసిన నివేదికలో సంచలన వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిపై లైంగిక దాడికి, రాత్రివేళ అసభ్య మెసేజీలు పంపుతూ వేధింపులకు పాల్పడినట్లు కమిటీ ధృవీకరించింది. విచారణలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు విద్యార్థినిపై వ్యక్తిగత పగ పెరిగినట్లు కూడా బయటపడింది.

పగ తీర్చుకునేందుకు కావాలనే ‘ఫెయిల్’

అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల నుండి తొలగించబడిన తర్వాత, అతను చివరి అవకాశంగా విద్యార్థినిపై పగ పెంచుకున్నట్లు కమిటీకి యాజమాన్యం వివరించింది. ఆమె రాసిన పీజీ పరీక్ష జవాబు పత్రాల్లో కావాలనే ‘ఇంటూ మార్క్’ వేసి ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేశాడని కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఆమె అన్ని ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు రాసినా, మార్కులు ఉద్దేశపూర్వకంగా తగ్గించబడినట్లు రివీలైంది. రీక్షల ఫలితాలు చూసి షాక్‌కు గురైన విద్యార్థిని, యాజమాన్యాన్ని మరోసారి ఆశ్రయించింది. ఫెయిల్ అయ్యే పరిస్థితి ఏమీ లేదని, తన జవాబు పత్రాలు మళ్లీ చూసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. విద్యార్థిని ఫిర్యాదు నిజమని భావించిన యాజమాన్యం, ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె ఆన్సర్ షీట్‌ను తిరిగి వాల్యుయేట్ చేయించింది. మళ్లీ పరిశీలనలో ఆమె పాస్ మార్కులు సాధించింది.

Read Also: ‘సిట్’ ముందుకు కేసీఆర్ మాజీ ఓఎస్డీ రాజశేఖర్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>