epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆన్‌లైన్ కంటెంట్ బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి: సుప్రీం

ఆన్‌లైన్ కంటెంట్‌కు ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాలని సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యానించింది. వినియోగదారులు అప్‌లోడ్ చేస్తున్న కంటెంట్‌కు ఎవరైనా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant) తేల్చి చెప్పారు. యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా కేసు విచారణ సందర్భంగా గురువారం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కామెడీ షోలో ఒక వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారం వంటి అంశాలపై ప్రశ్నించడం వల్ల అలహాబాదియా వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసుపై విచారణ సమయంలో కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పలు కీలక అంశాను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ఇది కేవలం అశ్లీలత సమస్య మాత్రమే కాదు. యూజర్లు సృష్టిస్తున్న కంటెంట్‌లోని లోపాలు స్పష్టమవుతున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువైనదే అయినప్పటికీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు’’ అని మెహతా తెలిపారు.

దీనిపై స్పందించిన సీజేఐ, ‘‘ఛానల్‌ సొంతం అన్న కారణంగా ఎవరిపైనా జవాబుదారి ఉండనవసరం లేదని భావించడం సరైంది కాదు. ఆన్‌లైన్‌ కంటెంట్‌ విషయంలో బాధ్యతాయుత వ్యవస్థ తప్పనిసరి’’ అని చెప్పారు. అధికారులు చర్యలు తీసుకునేలోపే అసభ్యకర లేదా దేశ వ్యతిరేక కంటెంట్‌ వైరల్‌ అవుతున్న పరిస్థితి ఆందోళనకర అంశమని ధర్మాసనం పేర్కొంది. దీనిని ఎలా నియంత్రిస్తారని సీజేఐ ప్రశ్నించారు. యూజర్‌ జనరేట్‌ కంటెంట్‌ నియంత్రణ కోసం కొత్త నిబంధనలు రూపొందించేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు(Supreme Court) వెల్లడించింది.

Read Also: ఆధార్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>