Mobile Popup Ad
Mobile Popup Ad

‘మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం’.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు!

కలం, వెబ్ డెస్క్ : అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి, అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఆరోపణలపై సైబర్ క్రైమ్ విభాగంలో మంత్రి సీతక్క (Seethakka) తరఫున పంచాయతీరాజ్ ఉద్యోగి పాండు నాయక్ ఫిర్యాదు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెల్‌ఫోన్ల కొనుగోలు విషయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టంగా రూ. 11,650కు కొనుగోలు చేసినట్లు వెల్లడించినప్పటికీ, దానిని కావాలనే రూ. 14,499 కు కొనుగోలు చేసిన‌ట్లుగా చూపిస్తూ సుమారు రూ. 30 కోట్ల అవినీతి జరిగినట్లు సోషల్ మీడియాల్లో అసత్య ప్రచారాన్ని జరుపుతున్నట్లు ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఈ కొనుగోలు ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో Government e-Marketplace (GeM) ద్వారా పారదర్శకంగా జరిగిందని.. కేంద్ర ప్రతినిధులు, ఐఏఎస్ అధికారుల కమిటీ పర్వవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియను మంత్రికి అనవసరంగా ముడిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఒక ఆదివాసీ గిరిజన మహిళ రాష్ట్ర మంత్రిగా ఉన్నత స్థానంలో ఉండటాన్ని సహించలేక, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారాన్ని నిర్వహిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ పారదర్శక నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజల్లో అపోహలు రేకెత్తించడం, మంత్రి గారి పట్ల ద్వేషాన్ని పెంచడం ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఆదివాసీ గిరిజన మహిళా మంత్రిపై ఇలాంటి చర్యలకు దిగడం దారుణమని చెప్పారు. కాబట్టి, ఇలాంటి దారుణానికి పాల్పడుతున్న బీఆర్ఎస్ పార్టీ అధికారిక, అనుబంధ సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి, మంత్రి సీతక్క (Seethakka) పై ఉన్న అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న బాధ్యులపై, వారి వెనుక వారిపై FIR నమోదు చేసి, చట్టపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>