స్త్రీనిధిలో ఒక్క‌రిని కూడా తొల‌గించ‌లేదు: సీతక్క

కలం, వెబ్ డెస్క్: దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18 శాతానికే పరిమితమైందని.. అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40 శాతానికి చేరుకుందని మంత్రి సీతక్క (Seethakka) వివరించారు. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలను రేవంత్ సర్కార్ ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. స్త్రీనిధి సంస్థపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 16 మంది ఉద్యోగులను తొలగించారని, ఇప్పుడు అదే వ్యక్తులు తప్పుడు ఆరోపణలతో సంస్థను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు

స్త్రీనిధిలో ఒక్క‌రిని కూడా తొల‌గించ‌లేదని.. ఇప్పటికే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని సీతక్క స్పష్టం చేశారు. సెర్ప్‌లో వంద శాతం బదిలీలు నిర్వహించామన్నారు. స్త్రీనిధిని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం తప్ప, ఎవరి ఉద్యోగాలను తొలగించడం కాదని అన్నారు. స్త్రీనిధి మహిళల కోసం, మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థ అని అన్నారు. దీనిని కాపాడుకుంటూ మహిళల ఆర్థిక అభివృద్ధికి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, స్త్రీనిధి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>