కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ (APSRTC) చైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవీ బస్సుల నిర్వహణ, కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో 10 వేల ఎలక్రిక్ బస్సుల అవసరం ఉందని.. వాటిని కొనడానికి రూ.17 వేల కోట్లు అవసరం అవుతుందన్నారు.
కొత్త విద్యుత్ బస్సులు కొనకుండా.. ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా నడపడమే ఉత్తమమన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ప్రభుత్వంపై తీవ్ర భారం పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనడం వీలు కాదని చైర్మన్ కొనకళ్ల నారాయణ చెప్పారు.

