కలం, వెబ్ డెస్క్: చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థులు గ్రూపు తగాదాలకు దిగుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఒకరిపైమరొకరు దాడిచేస్తూ భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ (Film Nagar) పరిధిలో గల వినాయక్ నగర్ బస్తీలో పాఠశాల విద్యార్థులు వీరంగం సృష్టించారు. చిన్నపాటి గొడవ కారణంగా రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు, ఒకరిపై ఒకరు దారుణంగా దాడికి దిగారు. పిడిగుద్దులతో రెచ్చిపోయారు. క్రమశిక్షణతో చదువుకోవాల్సిన విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకోవడం చూసి స్థానికులు షాక్ అయ్యారు.
ఈ గ్యాంగ్ వార్‌తో వినాయక్ నగర్ బస్తీ ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు. విద్యార్థుల (Students) అరుపులు, కేకలతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అడ్డు తొలగించుకోవడమే వాళ్ల విధానం: ఆర్ఎస్ఎస్ చీఫ్
Follow Us On : WhatsApp


