epaper
Wednesday, February 18, 2026
epaper

అడ్డు తొలగించుకోవడమే వాళ్ల విధానం: ఆర్​ఎస్​ఎస్​ చీఫ్

కలం, వెబ్​ డెస్క్​: తమ దారికి అడ్డుపడే వాళ్లను అడ్డు తొలగించుకోవడమే అమెరికా, చైనా విధానమని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (RSS)​ అధినేత మోహన్​ భగవత్​ (Mohan Bhagwat) మండిపడ్డారు. బుధవారం లక్నో యూనివర్సిటీలోని మాలవీయ ఆడిటోరియంలో జరిగిన ‘శోధార్థి సంవాద్​’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘పశ్చిమ దేశాలు ఫండమెంటలిజాన్ని వ్యాపింపచేస్తున్నాయి. అత్యంత శక్తిమంతంగా మారాలనేది వాటి ఆలోచన. స్వప్రయోజనాలే వాటి లక్ష్యం. తమ అవసరాల కోసమే పాకులాడతాయి. మిగిలిన ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదు. తమ ప్రయోజనాలే వాటికి ముఖ్యం. ఆ క్రమంలో తమ దారికి అడ్డుపడే వాళ్లను అడ్డుతొలగించుకోవడానికి కూడా అవి వెనకాడవు. ప్రస్తుతం అమెరికా, చైనా చేస్తున్నది ఇదే’ అని ఆయన మోహన్​ భగవత్​ అన్నారు.

పరిష్కారాలు భారత్​ చేతిలో..

ప్రస్తుతం ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, వాటికి పరిష్కారాలు భారత్​ వద్ద ఉన్నాయని మోహన్​ భగవత్​ వ్యాఖ్యానించారు. ‘భారత్ ప్రపంచ నాయకత్వం సాధించాలంటే అన్ని రంగాల్లోనూ శక్తిమంతంగా మారాలి. సత్యానికి బలం తోడైతే ప్రపంచం మనల్ని నమ్ముతుంది. అప్పుడే భారత్​ అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత్​ వద్ద సమాధానాలు ఉండడం దీనికి మూలం’ అని ఆయన (Mohan Bhagwat) అన్నారు.

Read Also: అది అత్యాచారయత్నమే : సుప్రీం కోర్టు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>