epaper
Wednesday, February 18, 2026
epaper

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

కలం, నాగార్జున సాగర్‌‌: నాగార్జున సాగర్‌‌‌‌ (Nagarjuna Sagar) జల విద్యుత్‌‌‌‌ కేంద్రంలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, కొత్త రికార్డును నమోదుచేసింది. నాగార్జునసాగర్ టి.జి జెన్‌కో (TGGENCO) మంగళవారం ఏకంగా గత 22 సంవత్సరాల చరిత్రలో మొట్ట మొదటిసారిగా 2502 మిలియన్ యూనిట్ల (MU) విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇది సంస్థ చరిత్రలోనే అతిపెద్ద స్థాయిలో జరిగిన విద్యుత్ ఉత్పత్తిగా నమోదైంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, టి.జి జెన్‌కో అధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పింది.

2025 – 26 సంవత్సరానికి 1450 మిలియన్‌‌‌‌ యూనిట్లను ఉత్పత్తి చేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకోగా.. ఈ క్రమంలో ఆరు నెలల వ్యవధిలోనే 1,450 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి చేరుకుంది. జల విద్యుత్ కేంద్రంలోని 7వ యూనిట్ కంటిన్యూగా 104 రోజుల పాటు నడుస్తూ.. ఫైనాన్సియల్ ఇయర్ లో మరో 6నెలల్లో 2237 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి జెన్‌కో లక్ష్యాన్ని సాధించింది. గత 22 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా 2502 మిలియన్‌‌‌‌ యూనిట్లను చేరుకొని టి.జి జెన్‌కో (TGGENCO) రికార్డును నెలకొల్పింది. టార్గెట్‌‌‌‌ను మించి విద్యుత్ ఉత్పత్తి చేరుకోవడంతో ఇంజినీర్లు జెన్‌‌‌‌కో ఆఫీస్‌‌‌‌లో కేక్‌‌‌‌ కట్‌‌‌‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Read Also: అద్దంలాంటి రోడ్లకే ప్రాధాన్యం.. బడ్జెట్ ప్రపోజల్స్‌పై కోమటిరెడ్డి రివ్యూ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>