పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం: విద్యార్థుల బస్సును ఢీకొట్టిన లారీ

కలం, వెబ్​ డెస్క్​ : ఖమ్మం (Khammam) జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసి తిరిగి వెళ్తున్న విద్యార్థుల బస్సును ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఖమ్మం గ్రామీణ మండలం సత్యనారాయణపురంలో ఈ ఘటన జరిగింది. అరెంపుల మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు సత్యనారాయణపురంలోని కేంద్రంలో తమ పదో తరగతి పరీక్షను ముగించుకుని, పాఠశాల బస్సులో తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎదురుగా వచ్చిన లారీ బస్సును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులతో పాటు బస్సులో ఉన్న ఒక ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: క్యాన్సర్ రోగులకు నేటి నుంచి రేడియేషన్ చికిత్స: మంత్రి రాజనర్సింహ

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>