కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో కలకలం రేగింది. దేశంలో మావోయిస్టులు అంతరిస్తున్న వేళ రాష్ట్రంలోని పురులియా జిల్లాలో పోస్టర్లు (Maoist Posters) కనిపించడం గమనార్హం. మంగళవారం ఉదయం పురులియా జిల్లాలోని బలరాంపూర్ పీఎస్ పరిధిలోని ఘాట్‌బేరా-కెరువా ప్రాంతంలో ఈ పోస్టర్లు కనిపించాయి. జంగల్‌మహల్ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను ఈ పోస్టర్లలో ప్రస్తావించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని.. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ప్రభుత్వ ఇండ్ల పంపిణీలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ మావోయిస్టుల పేరిట ఈ లేఖలు కనిపించాయి. సీపీఐ మావోయిస్టు పేరిట ఈ పోస్టర్లు కనిపించడంతో ఆందోళన నెలకొన్నది.
అధికారులకు వార్నింగ్
ప్రభుత్వ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలపై ఎంక్వైరీ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. స్థానిక పంచాయతీ ప్రతినిధులు, బ్లాక్ స్థాయి అధికారులకు హెచ్చరికలూ జారీ చేశారు. మరికొన్ని పోస్టర్ల (Maoist Posters)లో అక్రమ మద్యం వ్యాపారంపై ప్రస్తావించారు. అక్రమంగా మద్యం తయారు చేస్తూ విక్రయిస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాల్లో అక్రమంగా కలప కోతను నిషేధించాలని కూడా కోరారు. గతంలో ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు విస్తృతంగా ఉండేవి. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. కేంద్ర భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టర్లను తొలగించారు. అనుమానితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ పోస్టర్లు ఎవరు అంటించారు? మావోయిస్టులు అంటించారా? లేదంటే వారి సానుభూతి పరులు ఇటువంటి పోస్టర్లు అంటించారా? లేదంటే ఆకతాయిల పనా? అన్న కోణంలో భద్రతా బలగాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. పోస్టర్లు గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి ఏ4 సైజ్ పేపర్లుగా ఉండటంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
Read Also: పాక్ ఎన్ని ముక్కలు అవుతుందో.. రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

