Mobile Popup Ad
Mobile Popup Ad

క్యాన్సర్ రోగులకు నేటి నుంచి రేడియేషన్ చికిత్స: మంత్రి రాజనర్సింహ

కలం, వెబ్ డెస్క్: నిమ్స్ (NIMS)లో అత్యాధునిక లైనాక్ (LINAC) సేవలను నేడు ప్రారంభించుకున్నామని.. దీంతో క్యాన్సర్ రోగులకు ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స అందుబాటులోకి వచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Rajanarsimha) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరుగుతున్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. క్యాన్సర్ ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించి, కేన్సర్ రిజిస్ట్రీ‌ని ప్రారంభించారు. ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం తయారు చేసిన సమగ్ర ట్రామాకేర్ పాలసీని లాంచ్ చేశారు. హాస్పిటళ్లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర సంస్థలకు సంబంధించిన దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియను సులభతరం చేసే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసికి సంబంధించిన దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పీసీపీఎన్‌డీటీ, సరోగసి పోర్టల్స్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

నిమ్స్ లో లైనక్ సేవలతో తెలంగాణలో క్యాన్సర్ చికిత్స (Cancer Treatment) మరింత బలోపేతం అవుతోందని చెప్పారు. ఈ టెక్నాలజీతో ట్యూమర్‌పై మాత్రమే ప్రభావం చూపించి ఆరోగ్య కణజాలాన్ని కాపాడే చికిత్స అందించగలుగుతున్నామని వివరించారు. ట్రూబీమ్ (TrueBeam) సిస్టమ్‌తో తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 55-60 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ములుగు, ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లో కూడా కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాని అన్నారు.

రాష్ట్రంలో 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. నేటి నుంచి నిమ్స్‌లో మహిళల కేన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించుకున్నామని ప్రకటించారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని వివరించారు. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా హెచ్పీవీ టీకా అందిస్తూ గర్భాశయ క్యాన్సర్ ను నివారించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్యాన్సర్ ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించడం ద్వారా ప్రతి కేన్సర్ కేసును నమోదు చేసే విధానం తీసుకువస్తున్నామని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలియేటివ్ కేర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి రాజనర్సింహ (Minister Rajanarsimha) వివరించారు.

Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>