తెలంగాణ స్థానిక ఎన్నికల్లో వెనకబడిన కులాలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) అమలుచేయాడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం మీద ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ల ధర్మాసనం ఈ ఉత్తర్వు లు జారీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం నిమిత్తం లేకుండా పిటిషన్ సత్తాను బట్టి మెయిన్ పిటిషన్ మీద విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.
ఈ విచారణలో భాగంగా ఎన్నికల నోటిఫకేషన్ విడుదలకు ముందు రిజర్వేషన్లను ఎందుకు తీసుకురాలేదని జస్టిన్ విక్రమ్ నాథ్.. అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్విని ప్రశ్నించారు. కాగా రిజర్వేషన్ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని సింఘ్వి బదులిచ్చారు. తమిళనాడు గవర్నర్ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్ బిల్లు ‘డీమ్డ్ అసెంట్’ ఆధారంగా చట్టంగా మారిందని వివరించారు. ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేయకుండానే స్టే విధించడం జరిగిదంని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు సింఘ్వి. దీంతో అసలు ఒక బిల్లును ఎలా ఛాలెంజ్ చేస్తారు? అని జస్టిస్ అడిగారు. ‘‘బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. అది డీమ్డ్ అసెంట్ ఆధారంగానే అమల్లోకి వచ్చిందని సంఘ్వి సమాధానమిచ్చారు.
ప్రతివాదుల తరుపున న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. తాము రిజర్వేషన్లు 50 పరిమితిని దాటుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓను ఛాలెంజ్ చేశామని, కే కృష్ణమూర్తి, ఇతరు వర్సెస్ భారత ప్రభుత్వం, వికాస్ కిషన్‌రావు గవాలి కేసులో వచ్చిన తీర్పులను శంకరనారాయణన్ గుర్తు చేశారు. స్థానిక ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ట్రిపుల్ టెస్ట్‌ను అమలు చేయాలని చెప్పారు. ఇది వరకు ఇవి ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం, ఓబీసీలకు 25 శాతం మొత్తం 50శాతం పరిమితిలోపు ఉండేదని తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు సంబంధించి కేసుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతం దాటడానికి వీలులేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.
ప్రతివాదుల తరుపు వాదనలు వినిపించి మరో న్యాయవాది.. డీమ్డ్ అసెంట్‌గా బిల్లుకు ఆమోదం తెలపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంతగా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తమిళనాడు గవర్నర్ జడ్జిమెంట్ ప్రకారం.. బిల్లుకు ఆమోదం తెలపడంలో గవర్నర్ ఆలస్యం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కచ్ఛితంగా కోర్టు నుంచి మాండ్‌మస్ రిట్‌ను తీసుకోవాలని గుర్తు చేశారు.
ప్రతివాదుల వాదనలపై స్పందించిన సంఘ్వీ.. 50శాతం పరిమితి అనేది మార్చలేని అంశం కాదని అన్నారు. అంతేకాకుండా రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ట్రిపుల్ టెస్ట్‌లోని అన్ని అంశాలను సంతృప్తిపరిచిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సామాజిక, ఆర్థిక సర్వే చేశారని, ఏడాది పాటు కష్టపడి ఈ సర్వేను పూర్తి చేశారని ఆయన తెలిపారు.
‘‘వీటన్నిటి ఆధారంగా మీరు ఆర్డినెన్స్, బిల్‌ను తీసుకుకొచ్చారు. అది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది’’ అని జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. అయితే చట్టం అమలులో ఉందని సంఘ్వీ.. జస్టిస్‌కు వివరించారు.
వెంటనే స్పందించిన జస్టిస్ మెహతా.. గవాలి తీర్పు రిజర్వేషన్లు 50శాతం పరిమితిని మించడానికి అనుమతించదని ఎత్తి చూపారు. కాగా అనుభావిక డేటా ఉంటే రిజర్వేషన్లు 50శాతం పరిమితి దాటొచ్చని గవాలి అభిప్రాయపడ్డారని, సర్వే చేసింది తెలంగాణ ఒక్క రాష్ట్రమేనని సంఘ్వీ చెప్పారు.
ఈ వాదనలతో పిటిషన్ విచారణకు బెంచ్ అంగీకరించలేదు. దాంతో పిటిషన్‌ను కొట్టివేస్తున్టన్లు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ వెల్లడించింది. అంతేకాకుండా రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలను కొనసాగించవచ్చని జస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేశారు.
Read Also: కొండా సురేఖ ఇంటి నుంచి భద్రత తొలగింపు.. సీఎం ఆదేశమేనా..

