మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ప్రస్తుతం ‘పెద్ధి(Peddi)’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో రగ్‌డ్ లుక్స్‌లో అదరగొడుతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతెందుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రెండ్‌గా కూడా మారింది. అయితే ఇప్పుడు తాజాగా పెద్ధి ఫస్ట్ సింగిల్(Peddi First Single) రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ రెడీ అవుతోందట. ఎప్పుడు చేయాలని అన్న దానిపై ప్రస్తుతం డైరెక్టర్ అండ్ టీమ్ చర్చలు చేస్తోందని సినీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం. తాజాగా ఈ అంశంపై దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu) హింట్ ఇచ్చాడు. ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ నెంబర్ కానుందని చెప్పారు. ఈ సాంగ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ పాట ఎప్పుడు విడుదల అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. టాలీవుడ్ సర్కిల్స్‌లో మాత్రం నవంబర్ రెండో వారంలో ఫస్ట్ సింగిల్ రావొచ్చని టాక్ నడుస్తోంది.
Read Also: ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ ఊహకందదు: సాయితేజ్

