epaper
Tuesday, November 18, 2025
epaper

దుల్కర్‌‌కు భారీ షాక్.. హెరాష్‌మెంట్ కేస్ నమోదు..

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌(Dulquer Salmaan)కు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తన నటన, వైవిద్యమైన సినిమాలతో అందరిని ఆకట్టుకున్నాడు. మలయాళ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. చాలా డీసెంట్ ఫెలో అన్న ట్యాగ్‌ను కూడా అందుకున్నాడు. అలాంటి ఈ హీరో‌కు తాజాగా భారీ షాక్ తగిలింది. అదే అతనికి చెందిన నిర్మాణ సంస్థ ‘వేఫేరర్ ఫిలిమ్స్(Wayfarer Films)’పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దుల్కర్ సంస్థపై ఇలాంటి ఆరోపణలు ఏంటి అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఈ సంస్థ పేరు వాడుకుని దినిల్ బాబు అనే వ్యక్తి ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు తాజాగా బయటపడ్డాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎర్నాకులం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్త సినిమా ఆడిషన్ సమయంలో తనకే రోల్ ఇప్పిస్తానంటూ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. తనను  పనమ్మిల్లి నగర్‌లోని కార్యాలయ సమీపంలోని భవనానికి రమ్మని పిలిచాడని తెలిపింది. అక్కడకు వెళ్లిన తర్వాత తనపై లైగింకి వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. తనకు సహకరించకపోతే అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపింది.

Read Also: పెద్ధి ఫస్ట్ సింగిల్ అప్పుడే..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>