epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఇదే చివరి అవకాశం.. ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీం ఆదేశం

కలం, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు (MLAs Defection Case) ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని, ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఇప్పటికే తగినంత గడువు ఇచ్చామని, ఇక గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నా ఇంకా ముగ్గురిపై నిర్ణయం పెండింగ్‌లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.

నిర్ణయం తీసుకోకపోతే కీలక పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. సుప్రీంకోర్టులో గత కొంతకాలంగా విచారణలో ఉన్న పిటిషన్లపై (MLAs Defection Case) శుక్రవారం వాదనల సందర్భంగా బెంచ్ పై క్లారిటీ ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రావడంతో ఏడుగురి విషయంలో నిర్ణయం తీసుకున్నామని, ఇంకా ముగ్గురిది మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు స్పీకర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్ కుమార్‌లపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

Read Also: వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్న సీతక్క

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>