epaper
Friday, January 16, 2026
spot_img
epaper

వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్న సీతక్క

కలం, వెబ్ డెస్క్: మంత్రి సీతక్క (Seethakka) శుక్రవారం వేములవాడ వేములవాడ (Vemulawada) ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న స్వామిని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీతక్క రాజన్నకు కోడె ముక్కులు చెల్లించుకున్నారు. 19న మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతం చేయాలని రాజన్నను కోరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునః ప్రారంభవుతాయని తెలిపారు. మంత్రి సీతక్క వెంట రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎండోమెంట్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

అసియాలోని అతిపెద్ద జాతర మేడారం (Medaram)ను దృష్టిలో పెట్టుకొని మంత్రి సీతక్క ములుగును ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. వారంలో రెండుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులను ముమ్మరం చేస్తున్నారు. ఇతర మంత్రులు కొండ సురేఖ, పొంగులేని సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ములుగుకు ప్రత్యేకార్షణగా నిలిచిన తాడ్వాయిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు పార్కులు, టూరిజం, ఐలాండ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ములుగును గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>