కలం, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ దంపతులు ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్ తాలూకాలోని జిరాద్ గ్రామంలో భారీ ధరకు ల్యాండ్ కొన్నారు. ఈ ల్యాండ్ విలువ రూ.37.86 కోట్లు అని తెలుస్తోంది. ఈ లావాదేవీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ 2026 జనవరి 13న పూర్తైంది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ లిస్ట్‌లో ఇప్పుడు కోహ్లీ దంపతులు చేరిపోయారు. గాట్ నంబర్లు (సర్వే నంబర్ల) 157, 158లో ఈ భూమి ఉంది.
సోనాలి అమిత్ రాజ్‌పుత్ నుంచి అనుష్క, విరాట్ దంపతులు ఈ భూమిని కొనుగోలు చేశారు. సమీరా ల్యాండ్ ఆసెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్ఫర్మింగ్ పార్టీగా ఉంది. మహారాష్ట్ర నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి. ఈ మొత్తాలన్నీ ఎస్‌బీఐ ద్వారా గ్రాస్ చలాన్ల రూపంలో చెల్లించగా, అలీబాగ్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ధృవీకరించారు. ఇది అలీబాగ్‌లో కోహ్లీ, శర్మ దంపతుల తొలి పెట్టుబడి కాదు. 2022లోనే వీరు సమీరా హ్యాబిటాట్స్ నుంచి దాదాపు ఎనిమిది ఎకరాల భూమిని రెండు విడతల్లో రూ.19.24 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ భూమిలో ఇప్పటికే లగ్జరీ వెకేషన్ హోమ్‌ను నిర్మించారు.
ఇటీవలి కాలంలో అలీబాగ్ హైఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా వేగంగా ఎదుగుతోంది. గత ఏడాది హిరానందాని కమ్యూనిటీస్ 225 ఎకరాల్లో ‘హిరానందాని సాండ్స్’ టౌన్‌షిప్‌ను ప్రారంభించింది. అలాగే 2025 డిసెంబర్‌లో లోధా అలీబాగ్ వాడ్‌లోని ఎంపెరర్ ప్యాలెస్ ప్రాజెక్ట్‌లో ఐదు బెడ్‌రూమ్ ఫ్లాట్ రూ.33.5 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ వంటి పలువురు ప్రముఖులు కూడా అలీబాగ్‌లో భూములు కొనుగోలు చేశారు. తాజాగా విరాట్ కోహ్లీ–అనుష్క శర్మ చేసిన ఈ భారీ డీల్‌తో అలీబాగ్ వీకెండ్ డెస్టినేషన్ నుంచి లగ్జరీ నివాస ప్రాంతంగా మారుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: జర్నలిస్టుల అరెస్ట్‌పై కేసు నమోదు చేసిన హెచ్ఆర్సీ
Follow Us On: Sharechat


