epaper
Monday, March 2, 2026
epaper

మరో ఆయిల్​ ట్యాంకర్​పై దాడి.. భారతీయుడి మృతి

కలం, వెబ్​ డెస్క్​: హర్మూజ్​ జలసంధిలో మరో ఆయిల్​ ట్యాంకర్​పై(MKD VYOM) దాడి జరిగింది. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఒమన్​లోని మస్కట్​ తీరానికి 52 నాటికల్​ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్​ జెండా ఉన్న ఎంకేడీ వ్యోమ్​ చమురు నౌక వెళుతుండగా, ఓ మానవరహిత పడవ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయిల్​ ట్యాంకర్​తో మంటలు చేలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. నౌకలోని మెయిన్​ ఇంజిన్​ రూమ్​ను బలంగా ఢీకొట్టడంతో.. అక్కడున్న సిబ్బందిలో ఒకరు మరణించారు.

చనిపోయినవ్యక్తి భారత పౌరుడని ఒమన్​ ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఉద్ధేశ్యపూర్వకంగా జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన నౌకలో(MKD VYOM) మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారని, వీరిలో 16 మంది భారతీయులు, 4 బంగ్లాదేశీయులు, ఒకరు ఉక్రెయిన్​కు చెందినవాళ్లని వెల్లడించింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవాళ్లను మరో నౌక ద్వారా క్షేమంగా ఒడ్డుకు చేర్చినట్లు తెలిపింది.

కాగా, అమెరికా–ఇజ్రాయెల్​ సంయుక్త దాడుల్లో అధ్యక్షుడు అయతొల్లా ఖమేనీతోపాటు మరికొందరు కీలక నేతలను కోల్పోయిన ఇరాన్​ ప్రతీకార దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పర్షియన్​, ఒమన్​ గల్ఫ్​లను కలిపే హర్మూజ్​ జలసంధిలో ఆయిల్​ ట్యాంకర్ల రాకపోకలను సైతం లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం ఒక ట్యాంకర్​పై డ్రోన్​ దాడి జరిగింది. ఇందులోని 15 మంది భారతీయులు సహా సిబ్బంది మొత్తం త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు.

ఈ క్రమంలో మరో ఆయిల్ ట్యాంకర్​పై దాడి జరగడం కలకలం సృష్టిస్తోంది. ఇరాన్​కు మద్దతు తెలిపిన హూతీ ఉగ్రవాద సంస్థ.. సోమవారం ఆయిల్​ ట్యాంకర్​పై దాడికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!