కాంగ్రెస్ శివుడు, బీజేపీ విష్ణువు.. రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కొత్త అర్థాన్ని చెప్పారు. వికారాబాద్‌లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ (DCC Presidents Training) సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అంటే శివుడు, బీజేపీ (BJP) అంటే విష్ణువు అని రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆయన శివుడితో పోల్చుతూ.. తనలో సగభాగాన్ని స్త్రీకి ఇచ్చి, నిరాడంబరంగా అడిగితే ఇచ్చే విధంగా శివుడు ఉంటాడని రాహుల్ అభివర్ణించారు.

‘‘శివుడు శివుడి దగ్గర త్రిశూలం ఉన్నా అది వెనకే ఉంటుంది. ధర్మాన్ని కాపాడాల్సిన సమయంలో మాత్రమే శివుడు త్రిశూలం తీస్తాడు. బీజేపీ పార్టీ విష్ణువు లాగా ఆడంబరంగా ఉంటుంది. విష్ణువు నగలు, నట్రలతో ఆడంబరంగా కనిపిస్తారు. ఆడంబరాన్ని కాపాడుకోవడానికి మాత్రమే విష్ణువు దగ్గర ఆయుధాలుంటాయి. శివుడి పాత్రలో కాంగ్రెస్ ఉంది. విష్ణువు పాత్రలో బీజేపీ ఉంది’’ అని అన్నారు రాహుల్ గాంధీ (Rahul Gandhi).

Read Also: సీఎం వర్సెస్ సివిల్ సర్వెంట్స్.. ఆగ్రహం, అనుగ్రహం ఎవరిపై?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>