సింగర్ మంగ్లీ వెనుక KTR.. మాజీ మంత్రి రియాక్షన్ ఇదే

కలం, వెబ్ డెస్క్: ఇటీవల సింగర్ మంగ్లీ (Singer Mangli) వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మంగ్లీకి సంబంధించిన ఏదైనా వివాదం బయటపడినప్పుడల్లా.. కేటీఆర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఈ విషయమై తాజాగా బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. సింగర్ మంగ్లీ వెనుక కేటీఆర్ ఉన్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇలాంటి వార్తలను ఖండిస్తున్నామన్నారు. మంగ్లీ గురించి సత్యవతి మాట్లాడుతూ.. గతంలో మంగ్లీ కేవలం ముఖ్యమంత్రి సభలకు మాత్రమే హాజరయ్యేదని గుర్తుచేశారు. అలాగే మంత్రి సీతక్క కేసీఆర్‌కు నోటీసుల పంపడం‌పై సత్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అర్హత సీతక్కకు లేదని, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.

Read Also: గ్రౌండ్‌లో గడ్డి పొడుగుపై బార్సిలోనా కోచ్ కంప్లయింట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>