బీహార్ నూతన సీఎంగా సామ్రాట్​ చౌదరి : రేపే ప్రమాణ స్వీకారం

కలం, వెబ్​ డెస్క్​ : బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన సీనియర్ నేత సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) పగ్గాలు చేపట్టనున్నారు. తాజాగా జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే పార్టీ అధిష్ఠానం చౌదరి పేరును అధికారికంగా ప్రకటించింది.

సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నియామకం ద్వారా బీహార్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కొత్త మలుపు తిరగనున్నాయి. గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన నేపథ్యంలో, ఆయన రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పరిణామంతో బీహార్‌లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రాజకీయ చర్చకు తెరపడి, ఒక నవ శకం ప్రారంభం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: లేటెస్ట్ సెన్సస్ ప్రాతిపదికగా డీలిమిటేషన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>